పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కగా హీరోయిన్ మీనా !

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అటు రాజకీయాలు ఇటు సినిమాలు చేస్తూ.. ఫ్యాన్స్ ను కనువిందు చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ” భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజ్ కాగా… మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే… ఓ ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్క పాత్రలో… అలనాటి స్టార్ హీరోయిన్ మీనా నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు చేసిందట చిత్రబృందం. ఈ పాత్రలు చేసేందుకు మీనా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మే మాసంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ వార్తపై త్వరలోనే క్లారిటీ రానుంది.