తెలంగాణ ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీలన్నీ తమ అభ్యర్థుల గెలుపు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ అభ్యర్థి గెలుపు కోసం సామ దాన భేద దండోపాయలను ఉపయోగించి మరి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉంది. అటువంటి చోట ఓటర్లు ఏ పార్టీ వైపు చూస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మూడు పార్టీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని నిలబెట్టాయి. వీరిలో ఒకరు హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తుంటే, ఇంకొకరు ఈసారి గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరో అభ్యర్థికి రాజకీయాలే కొత్త వ్యాపారం రంగం నుంచి తీసుకువచ్చారు. ఆ అభ్యర్థులు ఎవరెవరు ఆ నియోజకవర్గ పరిస్థితులు ఏంటో చూద్దామా…
ఆర్మూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ నుండి ఆశన్న గారి జీవన్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇతను ఇప్పటికే రెండుసార్లు గెలిచారు. మూడోసారి గెలవడానికి తన ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుస్తానని ధీమాతో ఉన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఇతను చాలా కృషి చేస్తున్నాడు. అంతేకాక ఇతను కేసీఆర్ కు, కెసిఆర్ ఫ్యామిలీకి సన్నిహితుడు కావడంతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు సక్రమంగా అందాయని, ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడుగుతున్నాడు. మరి ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారు.
కాంగ్రెస్ నుంచి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇతను బిఆర్ఎస్ నుండి బిజెపిలో చేరారు. కానీ మారిన రాజకీయ పరిణామాల వల్ల కాంగ్రెస్ లో చేరడంతో కాంగ్రెస్ ఆర్మూర్ అభ్యర్థిగా ఇతనికి అధిష్టానం టికెట్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కు అనుకూల గాలి వీస్తుండడంతో, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజల ముందుకు తీసుకు వెళుతూ బిఆర్ఎస్ చేసిన అవినీతిని ప్రజలకు చెబుతూ ఓట్లు అడుగుతున్నారు. మరి ఓటర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో.
బిజెపి నుంచి పైడి రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇతను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి వ్యాపారవేత్తగా ఎదిగిన వ్యక్తి. దేశ విదేశాలలో వ్యాపారాలు ఉన్న వ్యక్తి ఇతనికి రాజకీయ అనుభవం లేదు. కొత్తగా బిజెపిలో చేరి ఆర్మూరు స్థానాన్ని సంపాదించుకున్నారు. మరి బిజెపి క్యాడర్ తో మాత్రమే ఇతను గెలిచే అవకాశాలు ఉన్నాయి.
మరి ఆర్మూర్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారో??