తెలంగాణ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అంతేకాకుండా గెలిచే అభ్యర్థిని మాత్రమే బరిలో దింపి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేసాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది తమ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం తమ శాయశక్తుల కృషి చేస్తున్నారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని ప్రకటించారు. ఇతను ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఐదోసారి గెలవడం కోసం నిజామాబాద్ నుంచి బరిలో దిగుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని బాజిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రేకులపల్లి భూపాల్ రెడ్డిని బరిలోకి దించారు. ఇతను డాక్టర్ గా ప్రజలకు సన్నిహితంగా ఉంటాడు. అంతేకాక గతంలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పొందారు. ఇప్పుడు అదే సానుభూతి గెలిపిస్తుందని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి తరుపున దినేష్ కులాచారికి టికెట్ ఇచ్చారు. ఇతను మారిన రాజకీయ పరిణామాల వల్ల బిఆర్ఎస్ నుంచి బిజెపిలోకి మారారు. ఇప్పుడు బిజెపి ఇతనికి టికెట్ ఇవ్వడంతో నియోజకవర్గంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
నిజామాబాద్ రూరల్ ప్రజలు పార్టీ మారిన దినేష్ కు నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేస్తారా లేక అభివృద్ధి చేసిన బిఆర్ఎస్ కు ఓటేస్తారా లేదా 6 గ్యారంటీలకు ఆశపడి కాంగ్రెస్ ను గెలిపిస్తారో వేచి చూడాల్సిందే..,