ఫేక్ ఎన్ కౌంటర్ కేసులో ఆర్మీ కోర్టు సంచలన తీర్పు

-

ఆర్మీ కోర్టు అంశీపొరా ఫేక్ ఎన్ కౌంటర్ కేసులో సంచలన తీర్పు జారీచేసింది. జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్ కేసు లో ముగ్గురు అమాయకులను హతమార్చిన ఆర్మీ కెప్టెన్ భూపేంద్ర సింగ్ కు జీవితఖైదు విధించాలని తీర్పునిచ్చింది. ఆర్మీ అత్యున్నత అధికారులు ఈ శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. 2020 జులై 18న రాజౌరీ జిల్లాకు చెందిన ముగ్గురు పౌరులను షోపియాన్ జిల్లాలో తీవ్రవాదులన్న తప్పుడు ముద్రవేసి కాల్చి చంపారు. ఇక్కడ జరిగిన కాల్పులలో మహ్మద్ అబ్రార్ (16), ఇంతియాజ్ అహ్మద్ (20), అబ్రార్ అహ్మద్ (25) తమ ప్రాణాలు కోల్పోయారు. నాటి ఎన్ కౌంటర్ లో ఆర్మీ కెప్టెన్ భూపేంద్ర సింగ్ నాయకత్వంలోని దళాలు కాల్పులు జరిపించారు.

కాగా, దీనిపై జమ్మూ కశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆర్మీ కెప్టెన్ భూపేంద్ర సింగ్ సహా ముగ్గురిపై చార్జిషీటు దాఖలు చేయడం జారిగింది. కెప్టెన్ భూపేంద్ర సింగ్ చేసింది బూటకపు ఎన్ కౌంటర్ అని బయటపడింది. అందుకు ఆధారాలు కూడా లభించాయి. ఆర్మీ కోర్టు తీర్పుపై పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ స్పందించారు. సైనిక కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవడం హర్షణీయమని వ్యక్తపరిచారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news