త్రిపురలోని ఒక ఆస్పత్రిలో వైద్యుడిపై ఉమ్మి వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కరోనా వైరస్ రోగులు హైకోర్టు మధ్యంతర బెయిల్ రద్దు చేయడంతో గురువారం పోలీసుల ముందు లొంగిపోయారు. నిందితులు న్యూ క్యాపిటల్ కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ అధికారి ముందు లొంగిపోయారని అక్కడి అధికారులు పేర్కొన్నారు. వారిని అధికారులు వెస్ట్ త్రిపుర చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
ఏడు రోజుల పోలీసు రిమాండ్ కోరినట్టు అధికారులు పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు చివరి నివేదిక వచ్చేవరకు తీర్పు రిజర్వ్‌ను ఉంచింది. నలుగురు నిందితులకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని త్రిపుర హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దిగువ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను తిరస్కరిస్తూ జస్టిస్ అరిందం లోధ్ బుధవారం నిందితులను లొంగిపోవాలని కోరారు. రాబోయే రెండు రోజుల్లో వారు లొంగిపోకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని హైకోర్టు దిగువ కోర్టును ఆదేశించింది. జులై 24 న ఈ సంఘటన జరిగింది. పశ్చిమ త్రిపుర జిల్లాలో డాక్టర్ సంగిత చక్రవర్తిపై నలుగురు ఉమ్ము ఊసారు.