దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్న నేపధ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు పరిక్షల మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు పరిక్షలు చేయడమే మంచి మార్గం అని కేంద్రం భావిస్తుంది. ఈ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా కరోనా ల్యాబ్ ల సంఖ్య 1370 ప్రయోగశాలలకు పెంచామని పేర్కొంది కేంద్రం. జనవరిలో ఒకటి నుంచి నేడు 1370 కి పెంచామని చెప్పింది.
రాష్ట్రాల్లో పరిక్షల వేగం ఇంకా పెంచుతున్నామని అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో గ్రామ స్థాయిలో కరోనా పరిక్షల సంఖ్యను ఇంకా పెంచే అవకాశం ఉంది అని చెప్పింది. కరోనా పరీక్షల్లో దాదాపు అన్ని రాష్ట్రాలు మెరుగ్గానే చేస్తున్నాయని చెప్పింది. ఫలితాలు వేగంగా వచ్చే విధంగా తాము ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది. కాగా దేశంలో కరోనా కేసులు 20 లక్షలకు చేరువలో ఉన్నాయి.