ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై నేడు కొనసాగనున్న వాదనలు

-

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా కొడుకు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై ముంబై   హైకోర్ట్ లో నేడు కూడా వాదనులు జరుగనున్నాయి. మధ్యాహ్నం 2 తరువాత ఆర్యన్ ఖాన్ బెయిల్ వ్యవహారం కోర్ట్ ముందుకు రానుంది. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అక్టోబర్ 3న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆర్యన్ ఖాన్ తరుపున ఇప్పటికే పలుమార్లు స్పెషల్ కోర్ట్ లో బెయిల్ దాఖలు చేసినప్పటికీ కోర్ట్ వాటిని తిరస్కరించింది. దీంతో ప్రస్తుతం ఆర్యన్ తరుపున న్యాయవాదులు హైకోర్ట్ లో బెయిల్ పిటీషన్ పెట్టుకున్నారు. ఆర్యన్ ఖాన్ తరుపున ప్రముఖ లాయర్, మాజీ అటార్ని జనరల్ ముకుల్ రోహాత్గీ వాదనలు వినిపిస్తున్నాడు. నిన్న జరిగిన వాదనల్లో ఆర్యన్ ఖాన్ నిందితుడు కాదు, కేవలం బాధితుడు మాత్రమే అని కోర్ట్ లో గట్టిగా వాదించారు. పట్టుబడ్డ సమయంలో ఆర్యన్ ఖాన్ నుంచి ఎలాంటి డ్రగ్స్ పట్టుబడలేదని, డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్ట్ తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news