వరదల్లో చిక్కుకున్న పశువుల కాపరులు.. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి ఆదేశాలు

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు గేట్లు ఎత్తడంతో దిగువ భాగం లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది.ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఎస్పీలకు స్వయంగా ఫోన్ చేసి అక్కడి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. నీటిపారుదల శాఖ, ఇతర అధికారులు, యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నారాయణపురం, ప్రమాదం తలెత్తే లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఆంధ్రా పరిధి కూడా ఉండడంతో అక్కడి ప్రభుత్వంతో కూడా మాట్లాడతానని, పెద్దవాగు వరద ఉధృతితో ఎక్కడా ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.కాగా.. బచ్చువారిగూడెం బ్రిడ్జి వద్ద పశువులను మేపేందుకు వెళ్లిన ఐదుగురు పశువుల కాపర్లు.. అకస్మాత్తుగా వాగు పొంగడంతో తప్పించుకునేందుకు వేపచెట్టు ఎక్కారు. ఉండే కొలది వరద ఉధృతి పెరగడంతో.. వారు చెట్టు దిగి కిందకు వచ్చే పరిస్థితి లేక పోవదంతో తాము వరదలో చిక్కుకున్నట్లు సెల్ ఫోన్ ద్వారా స్థానికులకు చెట్టు పైన తమ పరిస్థితిని వీడియో తీసి పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news