పాలస్తీనా ప్రజలకు భారత్ ఎప్పుడూ మద్దతు ఇస్తుంది : అసద్‌

-

ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధంపై ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం రెండు వారాలకు చేరింది. అక్టోబర్ 7న జరిగిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగాల్లోకి ప్రవేశించి ప్రజల్ని ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది మరణించారు. 200 మంది కన్నా ఎక్కువ మందిని హమస్ ఉగ్రవాదులు బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల వల్ల గాజాలో 4000 మంది మరణించారు. మొత్తంగా ఈ రెండు వర్గాల మధ్య వార్ కారణంగా మరణాల సంఖ్య 5600కి చేరింది. గత 80 ఏళ్లుగా ఇజ్రాయిల్ పాలస్తీనా భూమిని ఆక్రమించుకోవడం వాస్తవమే అని అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు.

Gandhi said Palestine belongs to Arabs; Netanyahu is a devil': Asaduddin  Owaisi - The Week

మహాత్మా గాంధీ మాటలను ఉటంకిస్తూ..‘‘ ఇంగ్లండ్ ఆంగ్లేయుల భూమి, ఫ్రాన్స్ ఫ్రెంచ్ వారి భూమి అయినట్లే, పాలస్తీనా అరబ్బుల భూమి అని మహాత్మాగాంధీ చెప్పారని నేను దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను’’ అని ఓవైసీ అన్నారు. పాలస్తీనా ప్రజలకు భారత్ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని, పాలస్తీయన్లు వారి సొంత స్వతంత్ర దేశం కలిగి ఉండాలని మేము ఎల్లప్పుడు భావిస్తామని ఓవైసీ అన్నారు. యుద్ధం ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాత పాలస్తీనాకు మద్దతుగా ఓవైసీ ట్వీట్ చేశారు. జెరూసలేంలోని అల్-అక్సా మసీదును పోస్ట్ చేసి..‘‘హ్యాండ్స్ ఆఫ్ గాజా, పాలస్తీనా జిందాబాద్, వయలెన్స్ ముర్దాబాద్, మస్జిద్ ఇ అక్సా అబద్ రహే’’ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.యుద్ధం ప్రారంభమైన వారం తర్వాత ఓవైసీ మాట్లాడుతూ.. 21 లక్షల జనాభా ఉన్న గాజలో 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారని, ప్రపంచం నిశ్శబ్ధంగా ఉందని, 70 ఏళ్లుగా ఇజ్రాయిల్ కబ్జాకు పాల్పడుతోందని, మీరు ఆక్రమరణ, దౌర్జన్యాలను చూడలేదరని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఇజ్రాయిల్ కి అనుకూలంగా మాట్లాడిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news