దేశంలో ఎప్పటికప్పుడు ముస్లిం సమాజానికి ఏదైనా సమస్య వస్తే స్పందించే మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కరోనా విషయంలో సరిగా స్పందించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముస్లిం సమాజానికి వైరస్ అవగాహన కల్పించే విషయంలో చురుగ్గా వ్యవహరించలేదని తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి టైం లో సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలకు ట్విటర్లో అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కరోనా వైరస్ వల్ల చనిపోయిన వారిని అందరిని అమరులుగా గుర్తించాలని పిలుపునిచ్చారు.మామూలుగా అయితే ముస్లిం ఎవరైనా చనిపోతే…చనిపోయిన మృతదేహానికి స్నానం చేయించి అత్తరు పోసి ఇస్లాం సాంప్రదాయం ప్రకారం నిండుగా వస్త్రం కప్పటం లాంటివి చేస్తుంటారు. అయితే ప్రస్తుతం దేశ ప్రజలంతా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా ఇంటి లో ఉండి కరోనా వైరస్ తో చేస్తున్నది యుద్ధమే కాబట్టి దాన్ని పోలుస్తూ.., ముస్లిం ప్రజలు ఎవరైతే వైరస్ వల్ల చనిపోయారో వాళ్లను అమరుల చెప్పడం బట్టి అదిరిపోయే లాజిక్ తో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు వేస్తున్నారు.
Jis insaan ka inteqaal waba ki wajah se hota hai, Islam mein uska darja shaheed ka hota hai. Shuhadah ko ghusl aur kafan ki zaroorat nahi hoti aur unhein jald se jald dafan kiya jaana chahiye https://t.co/lmQJxf30cZ
— Asaduddin Owaisi (@asadowaisi) April 2, 2020
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం ప్రమాదకరమైన ఈ వైరస్ తో మరణించిన వారి మృతదేహాన్ని అంత్యక్రియల్ని నిర్వహిస్తుంటారు. మరణించిన వారి కుటుంబ సభ్యుల్ని దూరం నుంచి చూసే అవకాశం కల్పిస్తారే తప్పించి.. వారిని ముట్టుకోవటం.. దగ్గరకు వెళ్లటానికి అనుమతించరు. ఇటువంటి టైములో అసదుద్దీన్ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది.