ఈ రోజు ఇండియా మరియు నేపాల్ ల మధ్యన ఆసియా కప్ లో భాగంగా మ్యాచ్ జరుగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో నేపాల్ జట్టు బ్యాటింగ్ చేసి ఇండియా ముందు 231 పరుగుల టార్గెట్ ను ఉంచింది. వాస్తవంగా నేపాల్ జట్టు ఇన్ని పరుగులు చేస్తుంది అని సగటు ఇండియా అభిమాని అనుకుని ఉండరు, బహుశా నేపాల్ ఫ్యాన్స్ కూడా అనుకుని ఉండరు. కానీ ఇండియా మొదటి అయిదు ఓవర్ లలోనే మూడు క్యాచ్ లు నేలపాలు చేయడంతో నేపాల్ ఆటగాళ్లు పూర్తి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేసి ఇండియా బౌలర్లను చాలా సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు చేశారు. చివరికి నేపాల్ జట్టు 48 .2 ఓవర్ లపాటు బ్యాటింగ్ చేసి 230 పరుగులకు పరిమితం అయింది. నేపాల్ జట్టులో ఆరిఫ్ షేక్ అర్ద సెంచరీ చేయగా, ఆ తర్వాత జట్టుకు ఈ మాత్రం స్కోర్ చేయడంలో సహాయపడింది భర్తేల్ (38), ఐరీ (29), సొంపాల్ (48) లు అని చెప్పాలి.
ఇక నేపాల్ ను కట్టడి చేయడంలో కొంచెం సక్సెస్ అయ్యారంటే వారు జడేజా (3) మరియు సిరాజ్ (3) లు వికెట్లు తీసుకుని రాణించారు. మరి ఇండియాకు నిర్దేశించిన ఈ మాత్రం లక్ష్యాన్ని రోహిత్ శర్మ సేన త్వరగా ఛేదిస్తుందా చూడాలి.