ఈ రోజు లాహోర్ లో పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్యన సూపర్ 8 మ్యాచ్ జరుగుతోంది. మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాకు మంచి ఆరంభం దక్కలేదు. స్కోర్ బోర్డు లో పరుగులు చేరకుండానే మెహిదీ హాడిన్ మిరాజ్ అవుట్ అయ్యాడు. అలా 47 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ దశలో షకిబుల్ హాసన్ క్రీజులో ఉండగా, అతనికి తోడు సీనియర్ బ్యాట్స్మన్ రహీం వచ్చి చేరాడు. వీరిద్దరూ తమ అనుభవాన్ని అంతా ఉపయోగించి దాదాపుగా టీం ను బయటపడేసేలా కనిపించరు. వీరిద్దరూ అయిదవ వికెట్ కు 100 పరుగులు జోడించారు. అంతా బాగుంది అనుకున్న సమయంలో షకిబుల్ హాసన్ (53) ఫహీమ్ అష్రాఫ్ బౌలింగ్ లో లేని షాట్ కు ప్రయత్నించి లాంగ్ ఆన్ లో జమాన్ చేతికి చిక్కాడు. ఇక ఆ తర్వాత కీపర్ రహీం (64) కూడా హరీష్ రాఫ్ బౌలింగ్ లో అనవసర షాట్ ఆడి కీపర్ కు దొరికిపోయాడు.
వీరిద్దరూ ఏ మాత్రం బాధ్యత లేకుండా ఆడి జట్టును కష్టాల్లోకి నెట్టేశారు. మరో పది ఓవర్ లు ఇద్దరూ ఆడుంటే స్కోర్ ఖచ్చితంగా 250 కు చేరి ఉండేది.