తమన్నా నువ్వు కావాలయ్య ఫుల్ వీడియో సాంగ్‌ రిలీజ్‌

-

ఓ మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. జైలర్ రూపంలో బాక్సాఫీస్ దాడి చేశారు. బీస్ట్ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రికార్డులు తిరగరాస్తూ భారీ రేంజ్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం జైలర్.

JAILER First Single 'Kaavaalaa' | Tamanna Dance 🔥 | Rajinikanth | Anirudh  | Nelson | Sun Pictures - YouTube

ఈ ఏడాది నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో నిలిచిన పాటల్లో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటుంది జైలర్‌ సాంగ్‌ నువ్‌ కావాలయ్య. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సాంగ్‌తో సినిమాకు మంచి బజ్‌ క్రియేట్ చేసింది. మ్యూజిక్ లవర్స్‌, తమన్నా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కావాలా ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. కావాలా సాంగ్‌ వేల సంఖ్యలో నెట్టింట రీల్స్‌ దర్శనమిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ తమన్నా డ్యాన్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా స్టెప్పులేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఇండియాతోపాటు విదేశాల్లో కూడా ఈ సాంగ్‌ ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్ ఫీవర్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫుల్ వీడియో సాంగ్‌కు కూడా మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రావడం పక్కా అయిపోయినట్టే. నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూళ్లు చేస్తూ.. నెట్టింట టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news