పెళ్లికి నో చెప్పాడని…ప్రియుడిపై వివాహిత యాసిడ్ దాడి..!

సోషల్ మీడియా విప్లవం తో కొన్ని ప్రయోజనాలు ఉన్నా కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎక్కొడో ఉన్న మహిళలకు పురుషులు వల వేసి మోసం చేయడం…మహిళలు పురుషులను వల వేసి మోసం చేయడం దాంతో నేరాలు ఘోరాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా సోషల్ మీడియా పరిచయం ఓ యువకుడిపై యాసిడ్ దాడికి దారితీసింది. కేరళకు చెందిన షీబా అనే మహిళకు ఫేస్ బుక్ లో అరుణ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

Yasid atack on young boy
Yasid atack on young boy

దాంతో యువకుడిని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే అప్పటికే ఆ మహిళకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నట్టు యువకుడికి తెలిసింది. దాంతో అతడు పెళ్లికి నిరాకరించాడు. దాంతో తనను పెళ్లి చేసుకోకుంటే పంచాయితీ పెట్టి పరువు తీస్తానని వార్నింగ్ ఇచ్చింది. అయినా యువకుడు పెళ్లికి నిరాకరించడం తో కోపం పెంచుకున్న షీబా యువకుడి పై యాసిడ్ పోసింది. దాంతో తీవ్రగాయాలతో అరుణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.