షాకింగ్ : పోస్టుమార్టం చేస్తుంటే… తిరిగి లేచిన డెడ్ బాడీ !

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. పోస్టుమార్టం చేస్తుండగా ఓ డెడ్ బాడీ.. లేచిన ఘటన శనివారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మోరాదాబాద్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. శ్రీ కేష్ కుమార్ అనే వ్యక్తి కి బైక్ యాక్సిడెంట్ కావడంతో.. బంధువులు అతన్ని శుక్రవారం.. మొరాదాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

అయితే తే.గీ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తేల్చి చెప్పారు. అనంతరం అతన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ కూడా… శ్రికేష్ కుమార్ చనిపోయాడని కన్ఫామ్ చేయడంతో వాడిని రాత్రంతా దాదాపు ఆరు గంటల పాటు మార్చురీ ఫ్రీజర్ లో ఉంచారు.

తెల్లవారుజామున పంచనామ కు పోలీసులు అలాగే కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు అతను బతికి ఉన్నట్లు గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది. అనంతరం అతన్ని ఆసుపత్రి వార్డులో కి షిఫ్ట్ చేసి డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం శ్రీ కేష్ కుమార్ కోమాలో ఉన్నాడని వైద్యపరీక్షల్లో తేలింది. అయితే డాక్టర్లు అతడు చనిపోయినట్టు ఎలా చెప్పాలి అనే దానిపై అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.