ఒకపక్క నిమ్మగడ్డ వద్దంటున్నా… జగన్ సంచలన నిర్ణయం

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు కాస్త సంచలనంగా ఉన్నాయి. ఈ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందని కొందరు అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని కొందరు అంటున్నారు. ఇక ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల విషయంలో వెనక్కు తగ్గాలని నిమ్మగడ్డ చెప్పినా సరే ఎపీ సర్కార్ మాత్రం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

తాజాగా వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం సంచలనం అయింది. 28.30 లక్షల ఇళ్ళ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించారు. జిల్లా స్థాయిలో టెండర్ కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చారు. కలెక్టర్ ఛైర్మనుగా 10 మందితో టెండర్ కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. కమిటీ వీసీగా జేసీ డెవలప్మెంట్, మెంబర్ కన్వీనరుగా గృహ నిర్మాణ జిల్లా స్థాయి అధికారిని నియమించారు.

సభ్యులుగా పరిశ్రమలు, గ్రామీణ నీటిసరఫరా, ఆర్ అండ్ బీ, విద్యుత్, పంచాయితీ రాజ్, కార్మిక, గనుల శాఖల జిల్లా స్థాయి అధికారులను నియమించారు. ఇళ్ల నిర్మాణంలో ప్రక్రియలో రివర్స్ టెండరింగ్ పద్ధతిని అనుసరించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక ఏపీ సర్కార్ తీరుపై ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news