శభాష్: తండ్రి కొడుకులను ఇద్దరినీ అవుట్ చేసిన అశ్విన్… !

-

డొమినికా వేదికగా ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో ఇండియా ఆరంభమలోనే మ్యాచ్ పై పట్టు బిగించే విధంగా ప్రదర్శన చేస్తోంది. ఆరంభంలో కొన్ని ఓవర్లు సరిగానే ఆడుతున్నట్లు కనిపించినా… అశ్విన్ సీన్ లోకి ఎంటర్ అవ్వగానే వికెట్ల పతనం స్టార్ట్ అయింది. మొదటగా యంగ్ ప్లేయర్ టాగ్ నరైన్ చందర్ పాల్ ను బౌల్డ్ చేసి ఇండియాకు మొదటి వికెట్ ను అందించాడు. ఆ తర్వాత ప్రమాదకరమైన కెప్టెన్ కిర్క్ బ్రెత్ వెయిట్ ను కూడా అవుట్ చేశాడు. కాగా చందర్ పాల్ ను అవుట్ చేసిన అశ్విన్ ఒక రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒక బౌలర్ గా తండ్రి మరియు కొడుకులను అవుట్ చేసి అరుదైన ఘనతను సాధించాడు. 2011 లో అశ్విన్ శివనారాయణ్ చందర్ పాల్ తో టెస్ట్ మ్యాచ్ ను ఆడి అతని వికెట్ ను పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో అతని కొడుకు వికెట్ ను తీసి తండ్రి కొడుకులను అవుట్ చేసిన బౌలర్ గా అవతారం ఎత్తాడు.

 

మరియు అశ్విన్ టెస్ట్ లలో బౌల్డ్ ద్వారా సాధించిన వికెట్ల సంఖ్యను మెరుగుపరుచుకున్నాడు. ఇండియా తరపున ఎక్కువ సార్లు (95) బౌల్డ్ లు చేశాడు. ఆ తర్వాత కుంబ్లే 94, కపిల్ దేవ్ 88 మరియు షమీలు 66 ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news