మెక్సికోలో దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటో నగరంలోని మాదక ద్రవ్యాల బాధితుల పునరావాస కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్ డీ అడిక్షన్ కేంద్రంలోకి చొరబడిన దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో 24 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఘటనా స్థలం భయానకంగా మారింది. ఈ కాల్పుల ఘటన వెనుక డ్రగ్స్ ముఠాల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరపువాటలో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. జూన్ 6న కూడా పునరావస కేంద్రంపై ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడటంతో 10 మంది మరణించారు. గతంలో 2010లో చివావా నగరంలోని డ్రగ్స్ డీఅడిక్షన్ సెంటర్‌పై ఇదేవిధంగా కాల్పులు జరిపారు. ఆ ఘటనలో 19 మంది మరణించారు.