ఏపీకి మరో షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాజ్య సభ లో మంగళవారం వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి అడిగిన ప్రశ్న కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా జావాబు చేస్తూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల నీతి ఆయోగ్ లో జరిగిన సమావేశంలో విజ్ఞప్తి చేసిన విషయం వాస్తవమేనని తెలిపారు.
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90% కేంద్రం వాటా, 10 శాతం నష్టం వాటా ఉంటుందని ఆయన వివరించారు. ఈ మేరకు పొందే ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక ఆర్థిక సహాయం కింద ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిన దరిమిలా రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కేంద్రం ప్రకటించిందనీ చెప్పారు కేంద్ర మంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏ మాత్రం తగ్గకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని క్లారిటీ ఇచ్చారు. దీనిపై మళ్లీ రాద్ధాంతం అవసరం లేదని వెల్లడించారు. కేంద్రం తాజా ప్రకటనతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి నిరాశే మిగిలింది.