రాజబాబు తో మొదటి డ్యూయెట్ చేసిన అతిలోకసుందరి..కారణం..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో అతిలోకసుందరి గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ , శోభన్ బా, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున లాంటి ఎంతో మంది స్టార్ హీరోలతో నటించడమే కాకుండా మూడు తరాల హీరోలతో నటించి మంచి పేరు తెచ్చుకుంది.. ఇంతటి ట్రాక్ రికార్డ్ ఉన్న శ్రీదేవి కమెడియన్ రాజబాబు తో జోడీగా నటించింది అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇకపోతే అతిలోకసుందరి గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె కమెడియన్ రాజబాబు తో అందులోనూ తన మొదటి డ్యూయెట్ సాంగ్ వేయడం చాలా ఆశ్చర్యకరం. మరి ఇందుకు గల కారణం ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.Comedian Raja Babu assets: లెజెండరీ కమెడియన్ రాజబాబు ఆస్తుల చిట్టా తెలుసా.. అమెరికాలో సొంత కంపెనీ..! | Here the shocking facts about Tollywood legendary comedian Raja Babu assets revealed by ...

అలనాటి ఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలతో సమానంగా పారితోషకం అందుకున్న ఏకైక కమెడియన్ రాజబాబు అని చెప్పడంలో సందేహం లేదు. నవ్వు ఒక్కటే జీవితం.. నవ్వు ఒక్కటే శాశ్వతం అంటూ అందరినీ నవ్వించిన ఏకైక కమెడియన్ రాజబాబు అని చెప్పవచ్చు. ఇక ఈయన ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయం సొంతం చేసుకోవడమే కాదు విజయనిర్మల , వాణిశ్రీ, శ్రీదేవి వంటివారితో కలిసి నటించడం గమనార్హం. ఇకపోతే శ్రీదేవి , రాజ బాబు కలిసి నటించిన చిత్రం ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.అతిలోకసుందరి శ్రీదేవి, రాజబాబు జంటగా నటించింది ఈ సినిమాలోనే.. | sridevi rajababu act as hero heroins in these film– News18 Teluguశ్రీ దేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ హీరోయిన్ గా అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న నేపథ్యంలో 1975వ సంవత్సరంలో కృష్ణ హీరోగా మంజుల హీరోయిన్ గా నటించిన చిత్రం దేవుడులాంటి మనిషి. ఇక ఈ సినిమాలో శ్రీదేవి, రాజబాబు సరసన నటించి మెరిసింది. అంతేకాదు ఈ సినిమాలో రాజబాబు తో శ్రీదేవి కి ఒక సాంగ్ కూడా ఉండడం గమనార్హం.

కెరియర్ మొదట్లో రాజబాబు తో కలిసి తన మొదటి డ్యూయెట్ సాంగును చేయవలసి వచ్చింది.కానీ ఆ తర్వాత దేశం గర్వించదగ్గ హీరోయిన్ గా చలామణి అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆకస్మాత్తుగా మరణించిన అప్పటికీ.. ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ హీరోయిన్ గా చలామణి అవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news