నెల్లూరు : నేడు ఆత్మకూరు ఉపఎన్నికల కౌంటింగ్ జరుగనుంది.నెల్లూరు పాళెంలోని ఆంధ్రా ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆత్మకూరు ఉప ఎన్నికల కౌంటింగ్ కు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. పటిష్టమైన పోలీస్ భద్రత వలయంలో కౌంటింగ్ ప్రక్రియ జరుగనుంది. మధ్యాహ్నానికి ఫలితాలు తెలిపోనున్నాయి.
మొదట పోస్టల్ బ్యాలెట్..అనంతరం ఈ.వి.ఎం.లలోని ఓట్ల లెక్కింపు జరుగనుంది. 14 టేబుళ్ల తో 20 రౌండ్స్ ద్వారా ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్నవారికే అనుమతి ఇవ్వనున్నారు అధికారులు.
ఏజెంట్లు 6 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని.. 2019 సాధారణ ఎన్నికలతో పోలిస్తే 18.18 శాతం తగ్గిన ఓటింగ్ శాతం నమోదు అయిందని పేర్కొన్నారు అధికారులు. ఇక 70 వేల మెజారిటీ రావొచ్చని భావిస్తున్నారు కొందరు వైసీపీ నాయకులు. వైసిపి అభ్యర్దిగా బరిలోకి మేకపాటి విక్రమ్ రెడ్డి ఉండగా.. బిజెపి తరపున భరత్ కుమార్ ఉన్నారు.