అత్యంత కిరాతకంగా బ్యూటిషియన్ పై హత్యాయత్నం…

-

 

మహిళ పరిస్థితి విషయం!

కృష్ణ‌ జిల్లా హనుమాన్ జంక్షన్లో దారుణం చోటుచేసుకుంది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళకు దగ్గరైన యువకుడు ఆమెపైనే చివరికి హత్యాయత్నం చేశాడు. స్థానిక వైష్టవి బ్యూటిపార్లర్ లో బూటీషియన్ గా పనిచేస్తున్న పిల్లి పద్మ అనే మహిళకు నూతన్ ప్రసాద్ అనే యువకుడితో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో వారిద్దరు కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా తీవ్ర ఆగ్రహంతో ఉన్న నూతన్ శుక్రవారం అర్థరాత్రి దాటాక అమె కాళ్లు, చేతులను ఎలక్ట్రానిక్ మోటార్లకు వాడే ప్రత్యేకమైన వైర్ తో కట్టేసి.. కత్తితో విచక్షణా రహితంగా దాడిచేసి బయటనుంచి తలుపు వేసి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

పద్మ అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి చేరుకున్న పోలీసులు బాధితురాలిని విజయవాడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తి విజయవాడలోని ఓ ఫ్రైవేటు బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తేలింది. వివాహేతర సంబంధం విషయంలో తలెత్తిన గొడవల కారణంగానే ఈ దాడి జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news