ఆదిపురుష్ నుంచి అదిరిపోయే పోస్టర్.. రాముడిగా ప్రభాస్ దుమ్ము లేపేసాడు

-

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కు ఉన్న క్రేజ్‌.. గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే…ప్రస్తుతం ప్రభాస్… వరుస సినిమాలతో దూసు కువెళుతున్నాడు.. నేషనల్ స్టార్ అయ్యాక మరింత స్పీడు పెంచి వరుస పెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇక ఇందులో ముఖ్యంగా ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

 

 

ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడి గా కనిపిస్తున్నాడు‌. రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ చేస్తున్నారు. ఆ పాత్ర పేరుని లంకేష్ అని ప్రకటించారు కూడా. లంకేష్ పాత్రలో కనిపించనున్నారు సైఫ్ ఆలీ ఖాన్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలోనే ఉంది.

 

అయితే.. తాజాగా ఆదిపురుష్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ను రిలీజ్ చేశారు. రాముల వారి గెటప్ లో ప్రభాస్ అదరగొట్టాడు. అటు సీత గెటప్లో కృతి సనన్ అద్భుతంగా ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news