మయన్మార్ లో మరో ఏడాది పాటు సైనిక పాలన అమల్లో ఉండనుంది.. అక్కడి ఆంగ్ సాన్ సూకీ సహా ఇతర నేతలను మిలటరీ అదుపులోకి తీసుకుంది. మయన్మార్ లో మరో ఏడాది పాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు మిలటరీ ప్రకటించింది. ఇక మిలటరీ లో సైనిక చర్యను ఐక్యరాజ్యసమితి, అమెరికా ఖండించాయి. మయన్మార్ లో అన్ని విమాన ప్రయాణాలు రద్దు చేసినట్లు ఆ దేశం ప్రకటించింది.
అంతే కాక విమాన సర్వీసులు రద్దును అమెరికా రాయబార కార్యాలయం కూడా ధ్రువీకరించింది. అయితే మయన్మార్ లో సైనికచర్య పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. మిలటరీ సైనిక చర్య ప్రజాస్వామ్యంపై దాడిలా ఉందని ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తామని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. మయన్మార్ సైనిక చర్యలను ఆపకపోతే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు ఏమి జరుగుతోంది అనేది ఆసక్తికరంగా మారింది.