మేడ్చల్ మండలంలోని అక్బర్జాపేట్ గ్రామానికి చెందిన మహంకాళి లక్ష్మి, మహంకాళి కృష్ణ దంపతులు. అదే గ్రామానికి చెందిన గుంటి బాలరాజ్ 2014లో మహంకాళి కృష్ణ ఆటో కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ స్నేహాన్ని అడ్డుపెట్టుకొని తరుచూ కృష్ణ ఇంటికి వెళ్లిన గుంటి బాలరాజు అతని భార్య లక్ష్మితో పరిచయం ఏర్పరచుకున్నారు.
ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో మహంకాళి కృష్ణ తన భార్యను మందలించాడు. అయితే ఆమె అతని మాట పేడ చెవిన పెట్టడమే కాకుండా భర్త అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. మహంకాళి లక్ష్మీ, ప్రియుడు గుంటి బాలరాజు తో కలిసి ఈ మేరకు పథకం వేసుకున్నారు. అందులో భాగంగా పలుమార్లు మహంకాళి కృష్ణకు కళ్ళులో నిద్రమాత్రలు కల్పి తాగించిన ఆతడికి ఏమీ కాలేదు. అందుకని ఈసారి గట్టిగా ప్లాన్ వేశారు.
2020 ఏప్రిల్ 8న రాత్రి సమయంలో మహంకాళి లక్ష్మి భర్త నిద్రపోయినా తర్వాత ప్రియుడు గుంటి బాలరాజు కు ఫోన్ చేసి ఇంటికి పిలుచుకొని తమ అక్రమ బంధం కొనసాగిస్తుండగా, వీరి శబ్దం విని నిద్రలేచిన కృష్ణ వారిని పట్టుకున్నాడు. దీంతో ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం కృష్ణను తీగలతో మెడను బిగించి హతమార్చారు. హత్య విషయం బయటపడకుండా కరోనా సమయంలో కళ్ళు మద్యం దొరకకపోవడంతో మనస్థాపనతో మరణించినట్లు భార్య కట్టుకథ అల్లింది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.