త్వరలోనే శీతాకాల సమావేశాలను పెడతాం.. 20 రోజుల పాటు సభ నడుపుతాం – సీఎం కేసీఆర్

-

త్వరలోనే శీతాకాల సమావేశాలను ఏర్పాటు చేసి.. 20 రోజులపాటు సభ నడుపుతామన్నారు సీఎం కేసీఆర్. విద్యుత్ సంస్కరణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంస్కరణలతో విద్యుత్ సిబ్బంది ఉద్యోగాలన్నీ పోతాయన్నారు. 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని.. ఉద్యోగులంతా సింహాల్లా పోరాడాలని సూచించారు. రాష్ట్రానికి రావలసిన విద్యుత్ కేంద్రం ఇవ్వకపోతే అప్పులు చేసి రైతులకు ఇచ్చామన్నారు.

రూ. 2,466 కోట్లు వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేశామని.. ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 17, 828 కోట్లు తెలంగాణకు రావాల్సి ఉందన్నారు. వీటిని కేంద్రం ఇప్పించడం లేదని ఆరోపించారు. ఏపీకి రూ 6 వేల కోట్లు నెల రోజుల్లో కట్టాలని అంటున్నారని.. ఇవ్వాల్సిన 3,000 కోట్లకు 18% వడ్డీతో రూ. 6000 కోట్లు కట్టాలంటున్నారని అన్నారు. నేను చెప్పింది అబద్ధం అని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

విశ్వ గురువు విశ్వరూపం బయటపడుతోందని.. శ్రీలంకలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయన్నారు. బిజెపి ప్రభుత్వం శాశ్వతం కాదని, ఈ ప్రభుత్వ కాలం ఇంకా 18 నెలలు ఉందన్నారు. దేశంలో 15 కోట్ల రైతు కుటుంబాలు ఉన్నాయని.. రైతులందరినీ ఏకం చేసి బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపుతామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news