కరోనా వైరస్ దెబ్బ క్రికెట్ కి గట్టిగానే తగిలింది. భారత్ సహా దాదాపు 14 దేశాలు నిత్యం క్రికెట్ మ్యాచులు ఆడుతూనే ఉంటాయి. కరోనా కారణంగా ఇప్పుడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. మన దేశంలో ఐపిఎల్ గురించి మరచిపోవాలని చెప్పింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మ్యాచులు జరిగే అవకాశాలు కనపడటం లేదు.
క్రికెట్ కి ప్రాధాన్యత ఇచ్చే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్ దేశాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకటనలు ఇచ్చే వాళ్ళు కూడా ముందుకి రావడం లేదు. ఇక ఆటగాళ్ళ భద్రతకు కూడా దేశాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ తరుణంలో క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా దెబ్బకు ఆ దేశ క్రికెట్ ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.
దీనితో క్రికెట్ ఆస్ట్రేలియా తన ఉద్యోగులను భారీగా తొలగించాలి అని నిర్ణయం తీసుకుంది. జీతాలు ఇవ్వడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కష్టంగా ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ లో ఆ దేశంలో టి20 ప్రపంచ కప్ జరగనుంది. దాని మీద చాలా ఆశలే పెట్టుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది నిర్వహించడం కష్టమే అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
Cricket Australia on Thursday laid off majority of its staff till June 30 as it battled a financial crisis triggered by the COVID-19 pandemic but remained hopeful of the T20 World Cup in October-November#T20WorldCup #CoronavirusPandemichttps://t.co/cM3l6NrzSi
— CricketNDTV (@CricketNDTV) April 16, 2020