పుష్ప ఐటెం సాంగ్ కు స‌మంత భారీ రెమ్యున‌రేష‌న్

-

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్ లో భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న సినిమా పుష్ప‌. ఈ సినిమా లో ఇటీవ‌ల ఐటెం సాంగ్ విడుద‌ల అయి వ్స్యూ ప‌రం గా దూసుకుపోతుంది. ప్రేక్ష‌కుల ఆధార‌ణ కూడా భారీ గా ఉంది. ఈ ప్ర‌త్యేక గీతం లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత చిందులు వేశారు. ఊ అంట‌వా మావా.. ఊ ఊ అంటావా మావా.. అంటూ సాగే ఈ పాట రికార్డులను కొల్ల‌గొడుతుంది. అయితే ఈ పాట‌లో స‌మంత నటించ‌డానికి భారీ గా పారితోషికం తీసుకుంద‌ని చిత్ర న‌గ‌ర్ కోడై కూస్తుంది.

కేవ‌లం ఈ ఒక్క పాట కోస‌మే స‌మంత‌ రూ. 1.5 కోట్ల పారితోషికం తీసుకుంద‌ని వార్తలు వ‌స్తున్నాయి. అలాగే ఈ పాట కోసం ప్రొడ్యూస‌ర్లు భారీ గానే ఖ‌ర్చు చేశార‌ని తెలుస్తుంది. ఈ పాట మొత్తం షూట్ చేయ‌డానికి రూ. 5 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని స‌మాచారం. ఈ ఐటెం సాంగ్ కోసం ప్ర‌త్యేకం గా ఒక సెట్ వేశారని.. దానికికే ఎక్కువ మొత్తం లో ఖ‌ర్చు అయింద‌ని తెలుస్తుంది. కాగ పుష్ప పార్ట్ 1 ఈ నెల 17న థీయేట‌ర్ ల‌లో పాన్ ఇండియా రెంజ్ లో విడుదల కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news