ఆస్ట్రేలియా సిరీస్ కు కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ !

-

ప్రస్తుతం ఇండియా వేదికగా వన్ డే వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ ముగిసిన అనంతరం ఇండియా ఆస్ట్రేలియా తో స్వదేశంలోనే టీ20 సిరీస్ ను ఆడాల్సి ఉంది. వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియా ఇండియా పర్యటనలో భాగంగా వన్ డే సిరీస్ ను పూర్తి చేసుకుంది. బాలన్స్ మిగిలి ఉన్న టీ 20 సిరీస్ ను వరల్డ్ కప్ అయ్యాక పూర్తి చేయనుంది. కాగా ఈ సిరీస్ కోసం దాదాపుగా సీనియర్ ప్లేయర్స్ అందరికీ విశ్రాంతిని కల్పించి కొత్త ప్లేయర్స్ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, కే ఎల్ రాహుల్, బుమ్రా హార్దిక్ పాండ్య లు రెస్ట్ తీసుకుంటున్నారట. కాగా ఈ జట్టుకు కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ను నియమించే దిశగా ప్లాన్ చేస్తున్నట్లు క్రికెట్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

ఇక ఈ టోర్నమెంట్ కు కోచ్ గా వి వి ఎస్ లక్షమం ను కోచ్ గా నియమించే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్ లో రింకు సింగ్, జైస్వాల్, గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్ లు ఆడనునట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news