ఏపీ లో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఆన్లైన్లో ఉంచింది. ఇంటింటి సర్వే అయ్యాక JAN 5న తుది జాబితాను వెల్లడించనుంది. మొత్తం 4,01,53,292 మంది ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 1,97,66,013, మహిళా ఓటర్లు 2,03,83,471 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 3,808 ఉండగా.. సర్వీసు ఓటర్లు 68,158 మంది ఉన్నారు. అనంత జిల్లాలో అత్యధికంగా 19.79 లక్షల ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 7.40 లక్షలు మంది ఉన్నారు.
ఇది ఇలా ఉంటె, మన తెలంగాణాలో శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ కూడా వెల్లడించారు. నవంబరు 3వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓటు హక్కు వినియోగించుకునే విధంగా విస్తృతంగా ప్రచారం చేస్తూనే ఓటరు నమోదుపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఓటు హక్కు నమోదుకు మరో నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలింది. అక్టోబరు 31లోగా దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. జిల్లాలో ప్రధానంగా ఉన్నా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటరు జాబితా అక్టోబరు 4న విడుదల చేశారు. అక్టోబరు 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన అర్హులందరూ ఓటు హక్కు నమోదు చేసుకునే దిశగా ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని కల్పించింది. అక్టోబరు 31వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. వీరితో పాటు ఓటరు జాబితాలో గల్లంతైన వారు, చేర్పులు, మార్పులకు సంబంధించిన దరఖాస్తులు కూడా చేసుకునే వీలుంది. నోటిఫికేషన్ నాటికి సప్లమెంటరీ జాబితా వెల్లడికానుంది. ఓటు హక్కు నమోదు కోసం అధికారులు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇంటింటి సర్వేలు కూడా చేపట్టారు. మరోవైపు ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలన జరుపుతున్నారు.