కరోనా మహమ్మారి నేపధ్యంలో ఇప్పుడు క్రికెట్ దేశాలు అన్నీ కూడా భారీగా నష్టపోతున్న సంగతి తెలిసిందే. మహమ్మారి విస్తరించడం తో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మ్యాచ్ అనేది జరిగే అవకాశం లేదు. ఇక కొన్ని దేశాలు ఆటగాళ్లకు జీతాలు ఇవ్వడం లేదు. ఈ నేపధ్యంలో ఇప్పుడు మన దేశం మీద క్రికెట్ దేశాలు ఆధారపడుతున్నాయి. మన దేశంలో క్రికెట్ ఆదరణ దృష్టిలో పెట్టుకుని మన తో ఆడాలి అని ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ మహమ్మారి నేపధ్యంలో ఆస్ట్రేలియా జాగ్రత్త పడుతుంది. మన దేశంతో ఈ ఏడాది చివర్లో మ్యాచ్ లు ఆడాలి అని భావిస్తుంది. మన దేశంతో ఆడకపోతే ఆ దేశ క్రికెట్ బోర్డ్ కి 300 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో ఆ దేశ ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. భారత పర్యటనకు మినహాయింపులు ఇవ్వాలి అని భావిస్తుంది. గ్లోబల్ లాక్డౌన్ కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా భారీ ఆర్థిక ఇబ్బందులు పడుతుంది.
80 శాతం సిబ్బందిని తొలగించింది. డిసెంబర్-జనవరిలో టీం ఇండియా నాలుగు టెస్టుల పర్యటనకు వెళ్ళే అవకాశం ఉంది. దీనితో నష్టాల నుంచి కాస్త బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, ఆస్ట్రేలియా సరిహద్దులు సెప్టెంబర్ 30 వరకు మూసివేయబడ్డాయి, అయితే ప్రయాణ ఆంక్షల పొడిగింపు ఉండవచ్చు. మన దేశంతో మరిన్ని మ్యాచ్ లు ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తుంది. మన దేశంతో ఆడకపోతే మరిన్ని నష్టాలు ఆ దేశ క్రికెట్ కి ఉండే అవకాశం ఉంది.