అబ్బ ఎంత చక్కగా నవ్వుతుందో ఈ పెంపుడు నక్క.. చక్కిలిగింతలు అవుతాయా.?

-

తమ ప్రాణాలు కాపాడిన వారి పట్ల జంతువులు ముందు నుంచి కూడా కాస్త ప్రేమతో ఉంటాయి. అత్యంత విశ్వాసంగా వ్యవహరిస్తూ ఉంటాయి. కుక్కలు అయినా ఇతర జంతువులు అయినా సరే తమను కాపాడిన వారి విషయంలో చాలా ప్రేమగా ఉంటాయి. తోడుగా ఉంటూ అండగా కూడా ఉంటాయి. తాజాగా ఒక నక్క చూపించిన ప్రేమ ఎంత గానో ఆకట్టుకుంది.

ఒక వ్యక్తి టెన్నీస్ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో బాల్ బయటపడగా వెంటనే ఒక రెడ్ ఫాక్స్ స్పందించి ఆ బంతిని తీసుకొచ్చి అతనికి ఇచ్చింది. ఆ నక్క పేరు ఫిన్నెగాన్. ఆ నక్కను అతను గతంలో ఒక ప్రమాదం నుంచి కాపాడగా ఇక అప్పటి నుంచి అతని వద్దే ఉంటుంది.

తాజాగా ఆ నక్క అతనికి చేసిన చిన్న సహాయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. దాని ఒంటిపై చేయి వేసి నిమిరిన సమయంలో దాని హావభావాలు బాడి లాంగ్వేజ్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news