డ్యాన్స్ స్టెప్పులు వేసిన ఆటోడ్రైవ‌ర్‌.. సినిమాలో చాన్స్ కొట్టేశాడు.. వీడియో..!

-

ప్రతిభ అనేది ఏ ఒక్క‌రి సొత్తు కాదు. ఎవ‌రి టాలెంట్ వారికే సొంతం. గతంలో చాలా మంది ఇలాగే త‌మ టాలెంట్‌ను ప్ర‌ద‌ర్శించి ఓవ‌ర్ నైట్ పాపుల‌ర్ అయ్యారు. సెల‌బ్రిటీలుగా మారిపోయారు. ఇప్పుడు ఓ ఆటోడ్రైవ‌ర్ కూడా అలాగే అయ్యాడు. తాను స‌ర‌దాకు చేసిన డ్యాన్స్‌కు త‌న‌కు సినిమా ఆఫ‌ర్‌ను తెచ్చి పెట్టింది. దీంతో అత‌ను సోష‌ల్ మీడియాలో బాగా పాపుల‌ర్ కూడా అయ్యాడు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

auto driver impressed with his dance moves got an offer in movie

మ‌హారాష్ట్ర‌లోని బారామ‌తి తాలూకాకు చెందిన బాబాజీ కాంబ్లే అత‌ను ఆటోడ్రైవ‌ర్ గా జీవ‌నం సాగిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను ఓ గ్యాస్ స్టేష‌న్‌కు త‌న ఆటోలో గ్యాస్ నింపించుకునేందుకు వ‌చ్చాడు. అయితే అక్క‌డ వాహ‌నాల భారీ క్యూ ఉంది. దీంతో తోటి ఆటో డ్రైవ‌ర్లు అత‌న్ని డ్యాన్స్ చేసి అల‌రించాల‌ని అడిగారు. వెంట‌నే బాబాజీ మారు మాట్లాడ‌కుండా ఆ గ్యాస్ స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లోనే అక్క‌డ పాపుల‌ర్ అయిన ల‌వ‌ని డ్యాన్స్ చేశాడు. ఈ క్ర‌మంలో అత‌ని డ్యాన్స్ స్టెప్‌ల‌ను అంద‌రూ చూస్తూ ఉండిపోయారు.

అయితే అదే స‌మ‌యంలో అత‌న్ని వీడియో తీసి కొంద‌రు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్ర‌మంలో ఆ వీడియోను మ‌హారాష్ట్ర ఇన్ఫ‌ర్మేష‌న్ సెంట‌ర్ డిప్యూటీ డైరెక్ట‌ర్ ద‌యానంద్ కాంబ్లే ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ఒక్క‌సారిగా వైర‌ల్ అయింది. బాబాజీ రాత్రి రాత్రే పాపుల‌ర్ అయ్యాడు. అత‌ని డ్యాన్స్‌ను చూసిన నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. మొత్తం 3.50 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోకు ఇప్ప‌టికే 84వేల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. దాన్ని మూడున్న‌ర వేల మంది రీట్వీట్ చేశారు. ఇక మ‌రాఠీ ద‌ర్శ‌కుడు ఘ‌న్ శ్యామ్ విష్ణుపంత్ యెదె బాబాజీ డ్యాన్స్ చూసి అత‌నికి త‌న సినిమాలో ఆఫ‌ర్ కూడా ఇచ్చాడు. దీంతో బాబాజీ ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యాడు. గ్యాస్ స్టేష‌న్ లో అత‌ను స‌రదా కోసం చేసిన డ్యాన్స్ అత‌నికి తెగ పాపులారిటీని తెచ్చి పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news