ఒక్కమాటతో బాబుకు షాక్… ప్రేక్షకుడిని చేసిన సుబ్బారెడ్డి!

-

టీడీపీకి చెందిన మాజీ మంత్రికి, ఒక సీనియర్ నేతకీ మధ్య రాష్ట్రం మొత్తం చర్చించుకునేలా, సీమ మొత్తం హాట్ టాపిక్ అయ్యేలా నడుస్తున్న అంశంపై ఆ పార్టీ అధినేత ఏమి చేయాలి. ఇద్దరినీ పిలిపించి మాట్లాడాలి లేదా అసలు ఆ విషయంలో తప్పేవరిది అనేది తనకు తానుగా తెలుసుకోవాలి.. అనంతరం ఎవరివైపు తప్పుందో వారిని మందలించాలి.. అనంతరం రాజీ చేయాలి! కానీ బాబు మాత్రం రొటీన్ కి భిన్నంగా ఆలోచించడంలో దిట్ట కావడంతో… అసలు ఆ విషయాన్నే పట్టించుకోవడం మానేశారు! అదే… అఖిలప్రియ – సుబ్బారెడ్డిల వ్యవహారం!

ఈ విషయంలో బాబు నుంచి తనకు ఎలాంటి మద్దతూ రాకపోవడంతో ఏకంగా పార్టీ మారడానికే అఖిల ప్రియ ఆలోచించేవరకూ వెళ్లారని వార్తలు వస్తున్నాయి. ఆ సంగతులు అలా ఉంటే… సుబ్బారెడ్డి అయితే ఈ విషయంలో అసలు బాబుని లెక్కచేసేది లేదని తేల్చేశారు! అవును… మాజీ మంత్రి అఖిలప్రియ-టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్న క్రమంలో చావటానికైనా సిద్ధమే… కానీ అఖిలప్రియతో మాత్రం రాజీపడనని సుబ్బారెడ్డి ప్రకటించారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన… టీడీపీ నాయకత్వం చెప్పినా.. అఖిలప్రియతో మాత్రం కలిసి పనిచేయనని తేల్చిచెప్పారు. అంటే… ఈ విషయంలో బాబు పెద్దమనిషిగా మధ్యవర్తిత్వంలో భాగంగా కల్పించుకుని, రాజీ ప్రయత్నం చేసినా కూడా వినేది లేదని సుబ్బారెడ్డి తేల్చి చెప్పేసినట్లే! ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజే బాబు స్పందించి ఉంటే.. సుబ్బారెడ్డి ఈ స్థాయిలో బాబు పరువు తీసేవారు కాకపోవచ్చు! కానీ.. వ్యవహారం ఇంతవరకూ వచ్చినా కూడా బాబు స్పందించకపోయే సరికి… ఇలా సుబ్బారెడ్డితో గాలితీయించుకునే పరిస్థితి బాబుకు వచ్చిందని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఏది ఏమైనా… ఈ వ్యవహారం ఇక టీడీపీ చేతులు దాటిపోయిందనే అనుకోవాలి! అంటే ఇక ఆ విషయంలో బాబుది ప్రేక్షక పాత్రే అన్నమాట!

Read more RELATED
Recommended to you

Latest news