త్వరలో పెళ్ళికొడుకు అవుతున్న అవినాష్… పెళ్లి కూతురు ఎవరో తెలుసా…!?

-

బిగ్ బాస్ తెలుగు సీసన్ 4 లో బెస్ట్ ఎంటర్టైనర్ అఫ్ దీ హౌస్ అంటే కచ్చితంగా ఆ బిరుదు ఇవ్వాల్సింది అవినాష్ కే . కింగ్ నాగార్జున కూడా ఇదే విషయాన్నీ తెలియజేసారు. హౌస్ లో అందరూ యాక్షన్ ఎపిసోడ్ సినిమా చూపిస్తే…అవినాష్ హౌస్ లోకి ఎంటర్ అయినా తర్వాతే అక్కడ కామెడీ యాంగిల్ కనిపించింది. దాదాపు 13 వారాలు అదరహో అనిపించాడు . ఓ రేంజ్ లో కామిడీ పండించాడు హౌస్ లో. తనదిన శైలిలో పంచ్ లు హావాబావాలతో అవినాష్ లో ఉండే స్టైల్ ఏంటో చూపించాడు. మొత్తానికి జబర్దస్త్ నుండి వచ్చిన అవినాష్… తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు బిగ్ బాస్ హౌస్ లో కి వచ్చి.

దాదాపు కొట్లాది మంది అభిమానుల గుండెల్లో తన స్థానాన్ని సుస్థిర పరచ్కున్నాడానే చెప్పాలి. ఇదీ కాకపోతే మరొక్క గేమ్ షో లేదా సినిమాలో మరిన్ని అవకాశాలు వస్తాయని తన అభిమానులు అంటున్నారు. అయితే అవినాష్ గురించి హౌస్ లో ఎక్కువగా మాట్లాడింది తన పెళ్లి విషయమె . ఇలా నాపై ఎక్కువ కామెంట్లు చేయకండి సార్ నాకు పిల్లను ఎవరు ఇవ్వరు అని నాగార్జునకి కూడా నమస్కారం పెట్టేవాడు.అయితే 2020 లో పెళ్లి బజాలు మొగుతూనే వున్నాయి కాబట్టి…2021 లో సెలబ్రిటీలా పెళ్లి విషయం లో ముందు అవినాష్ పేరే వినిపిస్తుంది అంటున్నారు. జబర్దస్త్ అవినాష్ నుంచి ఇప్పుడు బిగ్ బాస్ అవినాష్ అయిపోయాడు. హౌస్ లోకి వెళ్లిన తర్వాత తనని తాను ప్రేక్షకులకు కొత్తగా చూపించాడు.ఫీనాలెలో చిరంజీవి వచ్చినప్పుడు ఏకంగా అవినాష్ని రాజబాబు తో పోల్చాడు . అంత గొప్ప కమీడియన్ నీలో ఉన్నాడని చిరు చెప్పినప్పుడు గాల్లో తెలిపోయాడు అవినాష్. బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 90 రోజులు ఉన్న అవినాష్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇన్ని రోజుల ప్రయాణం లో అవినాష్ పెళ్లి గురించి దాదాపుగా 40 సార్లకు పైగానే చర్చ జరిగింది. ఆయనకు పిల్లను ఎవరు ఇవ్వరంటు నాగార్జున కూడా చాలా సార్లు అవినాష్ పై కమిడీలు చేసేవారు. ఇవన్నీ పక్కన పెడితే అరియనా తో మనోడు మంచి ట్రాక్ ఏ నడిపించాడు. దింతో ఇద్దరి మధ్య ఎదో నడుస్తోందని , అది కచ్చితంగా ప్రేమ అని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ మేము మంచి ఫ్రెండ్స్ అని అవినాష్ క్లియర్ చెప్పేసారు. అరియనా ఎప్పటికి తన జీవితం లో ఉంటుందని చెప్పాడు.

మరో వైపు అరియనా కూడా అదే చెప్తుంది. ఫినాలే ఎపిసోడ్ లో కూడా తన పెళ్లి గురించి ఓపెన్ అయిపోయాడు అవినాష్. నాగార్జున అడిగిన వెంటనే తన పెళ్లి గురించి ఓపెన్ అయిపోయాడు. 2021 సమ్మర్ లో తన పెళ్లి ఉంటుందని చెప్పాడు.అయితే అప్పుడు ముహుర్తాలు లేకపోతే ఎం చేస్తావని నాగార్జున అడిగితే …ఎదో ఒకటి పెట్టొకొని చేసుకుంటా అని సమాధానమించాడు అవినాష్. తన తీరు చూస్తుంటే ఇప్పటికే అమ్మాయి ని చూసుకున్నడని చెప్తున్నారు అతని అభిమానులు. మరో వైపు ఆ అమ్మాయి ఎవరో కాదు అరియాననే అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండటం తో దాన్ని పెళ్లి బందంగా మార్చాలని కోరుకుంటున్మారు ఫ్యాన్స్ . అరియన ఇంటికి వెళ్లిన సమయం లో కూడా అవినాష్ కూడా తనతోనే వున్నాడు. అరియన అవినాష్ కల్సి కేక్ కట్ చేశారు. అవినాష్ కుడ తాను ఎక్కడికెళ్లిన అరియన గురించే అడుగుతున్నారని చెప్తున్నాడు. అయితే అ రియాననే అతను పెళ్లి చేసుకుంటాడా… లేక తన తల్లి తండ్రులు చుసిన అమ్మాయి ని చేసుకుంటాడా అనేది 2021 సమ్మర్ వరకు వేచి చూడాల్సిందే మరి!

Read more RELATED
Recommended to you

Latest news