హత్రాస్ రేప్ లో పోలీసులు నిజాలు దాచారు: సిబిఐ

-

దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన హత్రాస్‌ ఘటనకు సంబంధించి సిబిఐ సంచలన విషయం వెల్లడించింది. 20 ఏళ్ల యువతీపై సామూహిక అత్యాచారం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ చేసిన సంగతి తెలిసిందే. తన చార్జిషీట్‌లో పోలీసుల లోపాల జాబితాను రూపొందించింది. ఆ బాలిక గతంలో చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను పోలీసులు రెండుసార్లు విస్మరించారు.

ఆమెకు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించలేదు అని పేర్కొన్నారు. దీనితో ఫోరెన్సిక్ సాక్ష్యాలు దొరకలేదని సిబిఐ పేర్కొంది. చార్జిషీట్లో, తప్పు చేసిన యుపి పోలీసు అధికారుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని సిబిఐ పేర్కొంది. సెప్టెంబరులో నలుగురు ఉన్నత కుల యువకులు ఆమెపై రేప్ చేసారు. ఆమె ఢిల్లీలో చికిత్స పొందుతూ మరణించారు. తెల్లవారుజామున 2 గంటలకు ఆమె మృతదేహాన్ని దహనం చేయటానికి ఆమె కుటుంబాన్ని బంధించి ఉంచడం వివాదాస్పదం అయింది.

పోస్టుమార్టం నివేదికలో రేప్ చేసిన వారికి క్లీన్ చిట్ వచ్చింది. లైంగిక వేధింపులకు ఎలాంటి ఆధారాలు లేవని, అయితే ఆమె ప్రైవేట్ భాగాలలో అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. ఆ తరువాత, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసును స్వీకరించిన సిబిఐ, సెప్టెంబర్ 14 న పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన సమయంలో ఆమె ఫిర్యాధుని లిఖిత పూర్వకంగా ఇవ్వలేదని గుర్తించింది. ఈ కేసులో దోషులు జైలు లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news