గుడ్డు వెజిటేరియనా ? నాన్ వేజిటేరియనా అనేది ఇప్పటికీ ఒక చర్చనీయాంశమే. కొందరు ఇది నాన్ వెజ్ అని తినరు. అయితే అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు ఢిల్లీ ఐఐటీలోని సెంటర్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ కావ్య దషోరా మొక్క ఆధారిత గుడ్డు (మాక్ ఎగ్)ను అభివృద్ధి చేశారు. అంతే కాక దేశం ఎంత అభివృద్ధి చెందినా పోషకాహార లోపంతో బాధపడే వాళ్లు ఇంకా కోట్లాది మంది ఉన్నారు. వీరికి కూడా ఇది ఉపయుక్తం కానుంది.
యునైటెడ్ నేషన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ) యాక్సెలరేటర్ ల్యాబ్ ఇండియా నిర్వహించిన ఇన్నోవేటివ్4ఎస్‌డీజీ పోటీలో ఈ మాక్ ఎగ్‌కు ప్రథమ బహుమతి లభించింది. ఈ ఎగ్‌లో మామూలు గుడ్డులానే ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. శాకాహారులకు ఇది చక్కని పుడ్ అని చెప్పచ్చు. అచ్చం గుడ్డులా కనిపించడమే కాక రుచిలో, పోషకాల్లో గుడ్డుకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇది అచ్చం పౌల్ట్రీ ఎగ్‌లానే ఉంటుందని కావ్య చెబుతున్నారు.