సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. యూనివర్సిటీలో జరిగే 37, 38వ నాతకోత్సవంలో ఎన్ వి రమణకు గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ డాక్టరేట్ అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సిజెఐ జస్టిస్ ఎన్వి రమణకు గౌరవ పట్టా ఇవ్వడం అద్భుతమైన ఘట్టమని అన్నారు. నాగార్జున యూనివర్సిటీలో చదివి అదే యూనివర్సిటీలో గౌరవ డాక్టరేట్ పొందడం ఇదే తొలిసారి అని అన్నారుు బొత్స.
విద్యే సంపద అని రాష్ట్ర ప్రభుత్వ నమ్మకం అన్నారు. రాష్ట్రంలో నూతన విద్యా విధానం అమలు చేస్తున్నామన్నారు. విద్యాశాఖలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మెరుగైన విద్యను అందించడమే జగన్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి బొత్స. గౌరవ డాక్టరేట్ తీసుకోవడం జస్టిస్ ఎన్వి రమణకు గర్వకారణం కాదు.. యావత్ రాష్ట్ర ప్రజానీకానికే గర్వకారణం అన్నారు.