తెలంగాణలో 41 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు – కేంద్రం

-

తెలంగాణలో 41 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. ఆయుష్మాన్ భారత్ – పీఎమ్ జన్ ఆరోగ్య యోజన(AB -PMJAY) కింద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధులపై రాజ్యసభలో ఎంపీ.డా.లక్ష్మణ్ ప్రశ్నకు సమాధానమిచ్చారు కేంద్రమంత్రి డా.భారతి ప్రవీణ్ పవార్. ఆయుష్మాన్ భారత్ కింద 7.09 లక్షల మంది ఆస్పత్రుల్లో చేరారు. దీనికి గాను రూ. 2,012 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. అందులో రూ. 236.05 కోట్ల కేంద్ర ప్రభుత్వ వాటాను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి విడుదల చేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.

తెలంగాణలో ఇప్పటి వరకు 41,98,258 మందికి ఆయుష్మాన్ భారత్ గుర్తింపు కార్డులు ఉన్నాయని ఇందులో 7,09,497 మంది ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆస్పత్రుల్లో చేరారని వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 746 ఆస్పత్రులు ఆయుష్మాన్ భారత్ పథకంలో కొనసాగుతున్నాయి. తెలంగాణలో PMJAY పథకంలో 29,02,621 కుటుంబాలు అర్హత కలిగి ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద పథకమని ఒక కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు చికిత్స పొందే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా 26,434 ఆస్పత్రులు ఈ పథకంలో ఉండగా అందులో 11,500 ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా 2023 మార్చి 20 వరకు 23.3 కోట్ల లబ్ధిదారులు ఈ పథకం కింద పరీక్షలు చేసుకోగా 4.49 కోట్ల మంది ఆస్పత్రుల్లో చేరారని ఇందుకు గాను రూ.54,224 కోట్ల ఖర్చు అయ్యిందని కేంద్రమంత్రి వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news