అంబుడ్స్ మెన్ పై పోలీస్ స్టేషన్ లో అజారుద్దీన్ ఫిర్యాదు

-

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో మరోసారి వివాదాలు తెరపైకి వచ్చాయి. తాజాగా హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సస్పెన్షన్ కు గురైన కొంత మంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు తనను బెదిరిస్తున్నారని.. ఫిర్యాదులో పేర్కొన్నారు అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్.

హెచ్ సిఎ ప్రస్తుత కార్యవర్గాన్ని జింఖానా ఆఫీస్ లో అంబ్బుడ్స్ మెన్ వారు భయపెడుతున్నారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు హెచ్ సిఎ అధ్యకుడు అజార్. దీంతో ఫిర్యాదు స్వీకరించిన బేగంపేట్ పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షు డు అజారుద్దీన్ కు.. గతంలో అజార్ ను సస్పెండ్ చేసిన అంబడ్స్ మెన్ మధ్య గత కొద్దీ రోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఇంతలోనే అజారుద్దీన్ అంబుడ్స్ మెన్ పై బేగంపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తో మరోసారి తెరపైకి వచ్చింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదం. ఈ కేసు పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news