“బచ్ పన్ కా ప్యార్” బాలుడికి రోడ్ యాక్సిడెంట్…పరిస్థితి విషమం..!

-

బచ్ పన్ కా ప్యార్ వీడియో తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలుడు సహదేవ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఛత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లా లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. తన తండ్రి తో కలిసి ఇంటికి వెళుతున్న సమయంలో బైక్ పై నుండి సహదేవ్ కింద పడ్డాడు. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తరవాత జగదల్ పూర్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు.

బాలుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి అని డాక్టర్లు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్ వినీత్ నందన్ వార్ మరియు జిల్లా పోలిస్ అధికారి సునీల్ శర్మ ఆస్పత్రికి చేరుకుని బాలుడిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఇదిలా ఉండగా టీచర్ ముందు బాలుడు పడిన బచ్ పన్ కా ప్యార్ పాట వైరల్ అవడం తో ఎంతో పాపులర్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news