బ్యాచిలర్‌ లైఫ్‌ భద్రమేనా..?

-

‘వద్దురా సోదరా‡ పెళ్లంటే నూరేళ్ల మంటరా’ అంటు ఓ సినీ కవి విన్పించాడు. ఎక్కువమాటుకు సినిమాల్లో బ్యాచ్‌లర్‌ లైఫ్‌లను చాలా బాగా చూపిస్తారు. అది సినిమా మాత్రమే.. కానీ నిజ జీవితంలో వాటిని ఎవరూ పాటించరనుకోంది.. పెళ్లి అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.. అందరికీ ఇష్టమే. కాగా ఇప్పటికే కొందరు పెళ్లిళ్లు చేసుకోకుండా అలాగే బ్యాచిలర్‌గా ఉంటుంటారు. అలాంటి వాళ్లకోక బ్యాడ్‌ న్యూస్‌ అంటున్నారు వైద్య నిపుణులు. సింగిల్‌గా ఉంటే ఎలాంటి టెన్షన్‌ ఉండదు, బాధ్యతలు ఉండవు సోలోగా సుఖంగా బతకవచ్చుని భావించేవాళ్లకు కాస్త ఇబ్బందే అంటున్నారు.

అసలు విషయమేంటంటే.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉన్నవాళ్లు త్వరిగతిన రోగాల బారిన పడుతున్నారంట. పెళ్లి చేసుకున్న వాళ్లతో పోలిస్తే వాళ్లకే ఎక్కువ శాతం రోగాలు వస్తున్నాయంట. గుండె జబ్బులు, బీపీ, షుగర్‌ తదితర రోగాలు అటెక్‌ చేస్తాయని బ్రిటన్‌లోని ఓ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైంది. పెళ్లి చేసుకుంటేనే ఎక్కువకాలం çసుఖసంతోషాలతో జీవిస్తారని పేర్కొంటున్నారు.

వీళ్లే ఆరోగ్యంగా..

పెళైన వాళ్లకు ఆయుప్రమాణం ఎక్కువట. బ్రిటన్‌ జరిపిన పరిశోధనలో దాదాపుగా 10 లక్షల మంది అవివాహితులు రక్తపోటు, మధుమేహం అధిక కొలెస్ట్రాల్‌ వంటి వ్యాధులతో బాధపడుతున్నట్టు వెలుగు చూసింది. దీనికి తోడు అవివాహితుల్లోనే ఎక్కువగా చికాకు, కోపిష్టి, అలసత్వం కన్పిస్తాయి. ఏదీ ఏమైనా పెళైనవారే చాలా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారని ఆ పరిశోధనలో తేలింది. అందుకే బ్యాచిలర్‌ లైఫ్‌ కన్నా పెళ్లి చేసుకోవడేమే ఉత్తమం అని వైద్యనిపుణులు సైతం సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news