ఆ విద్యార్థులకు కేంద్రం బంపర్‌ ఆఫర్‌

-

కొంత మంది ఏళ్ల కిందట డిగ్రీ చదివి సబ్జెక్టులన్నీ పాస్‌ కాలేక పోయి, పట్టా అందుకోలేక పోయిన విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. వివిధ పరిస్థితుల నేపథ్యంలో నిర్ణీత గడువులోగా సబ్జెక్టులన్నీ పాస్‌ కాలేక పట్టాను అందుకోలేకపోతారు. గడువు పూర్తి కావడంతో వారి డిగ్రీ క్యాన్సెల్‌ అవుతుంది. దీంతో అలాంటి వారు మళ్లీ డిగ్రీ పట్టా పొందాలంటే మళ్లీ కొత్తగా అడ్మిషన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. వారికి ఉస్మానియా యూనివర్సిటీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తమ యూనివర్సిటీ పరిధిలో గతంలో బ్యాక్‌ లాగ్స్‌ ఉండి డిగ్రీ పట్టా పొందలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తోంది. రీ అడ్మిషన్‌ పొందకుండా గతంలో మిగిలిన సబ్జెక్టులకు మాత్రమే ఫీజులు చెల్లించి పరీక్షలను రాసే అవకాశం కల్పించింది.

iit Jee 2019 exam postponed

 

 

యూనివర్శిటీ 30 ఏళ్ల క్రితం డిగ్రీ చదివి అప్పట్లో సబ్జెక్టులు మిగిలి పోయిన వారు కూడా పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికోసం విద్యార్థులు అప్లై చేసుకోవడానికి మార్చి 15 వరకు గడువు ఇచ్చింది.
సబ్జెక్టులు, డిగ్రీ చదివిన సంవత్సరం ఆధారంగా అధికారులు ఫీజులు నిర్ణయించారు. 2002–2012 మధ్య డిగ్రీ చదివి బ్యాక్‌ లాగ్‌ లు ఉన్న విద్యార్థులకు సబ్జెక్టుకు రూ. 6 వేలతో పాటు రెండు పేపర్ల వరకు అదనంగా రూ.710, మూడు పేపర్లు ఆ పైనా ఉంటే అదనంగా రూ.1010 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
1988–2002 మధ్య చదివిన విద్యార్థులైతే సబ్జెక్టుకు రూ. 10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రూ. 200 లేట్‌ఫీతో మార్చి 19 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. దీనికి సంబంధించిన పరీక్షలు ఏప్రిల్‌ లో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ ఎగ్జామ్‌ బ్రాంచ్‌ ను సంప్రదించాలని లేదా యూనివర్సిటీ అధికారిక వెబ్‌ సైట్‌ ను చూడాలని సూచించారు.

ఇదిలా ఉంటే యూనివర్సిటీ గతంలో బ్యాక్‌ లాగ్స్‌ మిగిలిపోయిన విద్యార్థుల కోసం మరో అవకాశం
కల్పించడంపై విద్యార్థుల నుంచి హర్షం వ్యక్తం అవుతున్నా.. ఫీజులు భారీగా నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. దీనిపై ఓ విద్యార్థి కోర్టును సైతం ఆశ్రయించాడు. ఒకవేళ కోర్టు ఫీజులను తగిస్తే ఆ మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి చెల్లిస్తామని అధికారులు తెలిపారు. ఏదీ ఏమైన వివిధ కారణాల వల్ల డిగ్రీ పట్టా పొందలేని వారికి ఇది సువర్ణ అవకాశం.

Read more RELATED
Recommended to you

Latest news