చైనాలో మ‌రో క‌ల‌క‌లం… ఓ కంపెనీ నుంచి బ్యాక్టీరియా లీక్‌!

-

డ్రాగ‌న్ కంట్రీ చైనాలో మరో క‌ల‌క‌లం రేగుతోంది. ఆ దేశంపై దెబ్బ‌మీద‌దెబ్బ‌ప‌డుతోంది. వ‌రుస‌గా విప‌త్తులు వ‌చ్చిప‌డుతున్నాయి. ఇప్పుడిప్పుడే క‌రోనా వైర‌స్ బారి నుంచి కోలుకుని ఆర్థికంగా పుంజుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న చైనాను మ‌రో మహమ్మారి గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. క‌రోనా వైర‌స్ కూడా ఓ ల్యాబ్ నుంచే బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్న వాద‌న‌లు బ‌లంగా వినిపిస్తున్న నేప‌థ్యంలో తాజాగా.. ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ నుంచి ప్రమాదకరమైన బ్రుసెల్లా బ్యాక్టీరియా లీక్ కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. దీంతో వేలాదిమంది మాల్టా వ్యాధి బారిన పడ్డారు.

వాయువ్య చైనాలోని గన్షు ప్రావిన్స్‌ రాజధాని లాంగ్‌ఝౌలో ఉన్న ఝోంగ్‌ము లాంగ్‌ఝౌ బయోలాజికల్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ నుంచి గతేడాది జూలై-ఆగస్టు మధ్య ఈ బ్యాక్టీరియా లీక్‌ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 3,245మందికి ఈ బ్యాక్టీరియా సోకిందని నిర్ధారించామని లాంగ్‌ఝౌ ఆరోగ్యవిభాగం ప్రకటించింది. ఈ బ్యాక్టీరియా సోకినవారు తలనొప్పి, కండరాల నొప్పి, జ్వరం, అలసటతోపాటు దీర్ఘకాలికంగా ఆర్థరైటిస్‌ తదితర సమస్యలతో బాధపడుతారని అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్ వెల్ల‌డించింది. ఇది మనిషి నుంచి మనిషికి సోకటం అరుదని, బ్యాక్టీరియా సోకిన ఆహార పదార్ధాలు తినటం వల్ల వ్యాపించి ఉండవచ్చని సీడీసీ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news