అసలే అశ్వత్థామ ప్లాప్ అయ్యి బాధ పడుతుంటే – నాగ శౌర్య కి కొత్త తలనొప్పి !

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరో గా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య ‘ఊహలు గుసగుసలే’ సినిమా తో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో అవకాశాలు అందుకున్నా నాగశౌర్య చేసిన సినిమాలు చాలా వరకూ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఆ తర్వాత చలో సినిమా తో విజయాన్ని అందుకున్న నాగశౌర్య…తర్వాత చేసిన సినిమాలు కూడా మళ్లీ ఫ్లాప్ అవ్వటం స్టార్ట్ అయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో తానే తన సినిమాకి ‘అశ్వథ్థామ’ అనే స్టోరీని రాసుకున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై మాస్ యాంగిల్ లో తనని తాను చూపించుకోవాలనే ఉద్దేశంతో ‘అశ్వథ్థామ’ సినిమాని తెరకెక్కించారు.

Image result for naga shourya ashwathama movie cast

సొంత బ్యానర్ లో తెరకెక్కిన ‘అశ్వథ్థామ’ సినిమాపై అంచనాలు భారీ ఎత్తున ఉండటంతో …సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో ‘అశ్వథ్థామ’ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో తీవ్ర నష్టాల్లో సినిమా ఉండటంతో నాగ శౌర్య ఫుల్లుగా కుంగిపోయి ఉన్న ఈ సమయంలో కొత్త తలనొప్పి వచ్చి పడింది. అదేమిటంటే నాగ శౌర్య తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం జరిగింది తెలంగాణ డ్రైవర్ల యూనియన్ జేసీ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది.

విషయం ఏమిటంటే సినిమాలో నాగ శౌర్య ఒక సీన్‌లో చదువుకోని డ్రైవర్లు మందు తాగి డ్రైవ్‌ చేస్తూ ఆడవారి జీవితాలను నాశనం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు డ్రైవర్ల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయని, ఒక్కరు ఇద్దరు తాగుబోతు డ్రైవర్లు ఉంటే పూర్తి వ్యవస్థను అలా విమర్శించడం ఏంటంటూ డ్రైవర్ల సంఘం జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగశౌర్య బహిరంగంగా మీడియా ముందు వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సినిమా ఒకపక్క ఫ్లాప్ అవడంతో మరోపక్క డ్రైవర్లు గోల ఎక్కువ అవటంతో నాగ శౌర్య పరిస్థితి పాపం అన్నట్టుగా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news