పవన్ కల్యాణ్ + మహేశ్ బాబు ఇద్దరు తోపు హీరోల మధ్య ఇరుక్కుపోయిన సెన్సేషనల్ డైరెక్టర్ !

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఇద్దరికి ఇద్దరు టాప్ హీరోలు. వీరిద్దరిలో ఏ ఒక్కరూ సినిమా రిలీజ్ అయినా గాని టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మార్కెట్ మోత మోగుతోంది. సినిమా టాక్ తో పనిలేకుండా కలెక్షన్ లో వరుసగా మూడు రోజుల్లో రికార్డు స్థాయిలో రావడం గ్యారంటీ. మొన్నటి వరకు రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వటంతో మళ్లీ వీరిద్దరి మధ్య పోటా పోటీ వాతావరణం ఇండస్ట్రీలో కనబడుతోంది.

Image result for pawan kalyan mahesh babu

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బాలీవుడ్ సూపర్ హిట్ ‘పింక్’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇదే కాకుండా ఇంకా రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టిన పవన్ తో ‘అర్జున్ రెడ్డి’ సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ అయిపోయిన సందీప్ రెడ్డి వంగా సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినపడుతున్నాయి.

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే మహేష్ బాబు తో గాని లేకపోతే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు ఇద్దరిలో ఎవరు అవకాశం ఇస్తారో అన్నా ఉత్కంఠ తో చాన్స్ కోసం ఎదురు చూస్తూ వీరిద్దరి కోసం కథలు రెడీ చేసుకుని సందీప్ రెడ్డి వంగా ఇరుక్కుపోయినట్లు ఫిలింనగర్ లో టాక్.

Read more RELATED
Recommended to you

Latest news