టెస్ట్‌ క్రికెట్‌లో రికార్డులు బ్రేక్‌ చేసిన పాకిస్థాన్‌ బుడ్డోడు!

-

టెస్టు క్రికెట్‌లో ఎందరో హేమాహేమీలు ఎన్నో రికార్డులు నమోదుచేశారు. వాటిలో కొన్ని రికార్డులు ఇప్పుడు బ్రేక్‌ అయ్యాయి. ఆ రికార్డులు బ్రేక్‌ చేసింది ఎవరో తెలుసా.. పాకిస్థాన్‌ యువ ఫేసర్‌ నజీమ్‌ షా. ఆదివారం బంగ్లాదేశ్‌తో టెస్టులో హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన ఈ 16 ఏండ్ల బుడ్డోడు.. టెస్టు క్రికెట్‌ చరిత్రలో హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ మధ్య రావల్పిండి క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు నజీమ్‌ షా ఈ ఫీట్‌ సాధించాడు. అద్భుతమైన బంతులతో నజ్ము హుస్సేన్‌ శాంటో (37), తైజుల్‌ ఇస్లామ్‌ (0), మహ్మదుల్లా (0) లను వరుసగా పెవిలియన్‌ బాటపట్టించి ఔరా! అనిపించాడు. అంతేకాదు 2002 తర్వాత పాకిస్థాన్‌ తరఫున హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా కూడా నజీమ్‌ షా రికార్డు నెలకొల్పాడు. 2002లో మహ్మద్‌ సమీ హ్యాట్రిక్‌ తర్వాత ఇదే తొలి హ్యాట్రిక్‌ కావడం గమనార్హం.

తన కెరీర్‌లో కేవలం నాలుగో టెస్టు ఆడుతున్న నజీమ్‌ షా పేరిట మరో రికార్డు కూడా ఉంది. గత డిసెంబర్లో ఒకే టెస్టులో 5 వికెట్లు తీసి, ఈ ఘనత సాధించిన అతిచిన్న వయసు ఫాస్ట్‌ బౌలర్‌గా కూడా రికార్డు నమోదు చేశాడు. కాగా, తాజా టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ 6 వికెట్లకు 126 పరుగులు చేసి 86 పరుగులు వెనుకంజలో ఉంది. మిమినుల్ హాక్‌ (37), లిటన్‌ దాస్‌ (0) నాటౌట్‌గా క్రీజ్‌లో ఉన్నారు. నజీమ్‌ షా 8.2 ఓవర్లలో 26 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news