రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఈ కొత్త నిబంధనలు గమనించారా?

-

భారతీయ రైల్వే నూతన నిబంధనను తీసుకొచ్చింది. పరిమితికి మించి లగేజ్‌తో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అదనపు ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ ట్విట్టర్ వేదికగా బుధవారం వెల్లడించింది. ‘రైలులో ప్రయాణించే వ్యక్తులు ఎక్కువ లగేజ్‌ను తీసుకెళ్లవద్దు. ఒక వేళ కచ్చితంగా లగేజ్ తీసుకెళ్లాలని అనుకుంటే లగేజ్ వ్యాన్ బుక్ చేసుకోండి. లగేజ్ తక్కువగా ఉంటే.. ప్రయాణం సరదాగా సాగుతుంది.’ అని పేర్కొంది. అయితే ఆయా కోచ్‌ల ఆధారంగా లగేజ్ బరువును ప్రకటించింది.

ప్రయాణికులు-లగేజీ
ప్రయాణికులు-లగేజీ

40 నుంచి 70 కేజీల వరకు బరువున్న లగేజ్‌ను ప్రయాణికులు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం.. స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించే ప్రయాణికుడు 40 కేజీల బరువున్న లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఏసీ టు టైర్‌లో ప్రయాణించే ప్రయాణికుడు 50 కేజీల బరువున్న లగేజీ, ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించే ప్రయాణికుడు 70 కేజీల వరకు లగేజ్‌ను ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. ఒక వేళ అదనపు లగేజ్ ఉన్నట్లయితే.. రూ.109 చెల్లించాల్సించి ఉంటుంది.

కాగా, రైల్వేల్లో నిషేధిత రసాయనాలు, యాసిడ్, టపాసులు, గ్రీస్, ఆయిల్ తదితర వస్తువులను తీసుకెళ్లరాదు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రైల్వే యాక్ట్ సెక్షన్ 164 ప్రకారం అరెస్ట్ చేయడం జరుగుతుందని రైల్వే శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news