లేటెస్ట్ షాక్: యూత్ కి బ్యాడ్ న్యూస్ చెప్పిన జర్మనీ యూత్!

-

ప్రపంచమంతా కోరనా దెబ్బకు విలవిలలాడిపోతుంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థతో కరోనా వైరస్ ఆడుకుంటుందనే చెప్పాలి. ఆరు నెలలుగా క‌రోనా వైర‌స్ పంజా విసురుతూనే ఉంది. అయితే ఇలాంటి ఈ సమయంలో ఆ వైర‌స్ విస్త‌ర‌ణ‌, ల‌క్ష‌ణాలలో కొత్త కొత్త విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. జపాన్ రాజధాని టోక్యోలో కొత్త విష‌యం.. కాదు కాదు.. సరికొత్త రహస్యం బ‌యట ప‌డింది.

అవును.. ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా వైరస్ అధికంగా.. వృద్ధులు, చిన్నారుల‌కు ఎక్కువగా ప్రభావం చూపే ప్రమాదం ఉందని.. వారికే ఈజీగా సోకుతుందని.. అధికారులు హెచ్చ‌రించారు. కానీ ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే షాక్ గురౌతున్నారు ప్రజలు. జపాన్ రాజధాని టోక్యోలో కొత్త విష‌యాన్ని గుర్తించారు వైద్యాధికారులు. టోక్యోలో తాజాగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి. వరుసగా నాలుగో రోజు సుమారు 200కు పైగా కేసులు పాజిటివ్ ‌గా నిర్ధారించారు. అయితే.. ప్రభుత్వం అక్కడ లాక్‌ డౌన్ ‌ను ఎత్తివేసిన త‌ర్వాత‌.. కేసుల పెరుగుదల స్టార్ట్ అయింది. ఫలితంగా టోక్యో సిటీలో డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది.

అసలు విషయం ఏమిటంటే.. క‌రోనా కరాళ నృత్యం టోక్యోలో బాగా విస్తరిస్తుంది. ముఖ్యంగా ఈ వైరస్‌వ్యాప్తి చెందిన వారిలో 80శాతం 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే ఉన్నారని స్థానికంగా కలకలం రేగుతోంది. అలాగే.. నైట్ ‌క్లబ్ ‌లతో 48 కేసులు వచ్చినట్టు అధికారులు తేల్చారు. నైట్ ‌క్ల‌బ్ ‌ల్లో క‌లిసి తాగ‌డం, డ్యాన్స్ ‌లు వంటి కార్య‌క్ర‌మాలు జరపడం కారణంగా.. నైట్ ‌క్ల‌బ్ ‌లు క‌రోనా హాట్‌ స్పాట్లుగా మాతున్నాయ‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మౌతుంది. కాగా ఇక క్ల‌బ్‌ ల్లోకి వెళ్లేది కూడా ఎక్కువ యూత్ కావ‌డంతో.. వారే ఆ మాయ‌దారి వైర‌స్ బారిన ప‌డుతున్నార‌నే అంచ‌నాలు వేస్తున్నారు విశ్లేషకులు. సో… నిర్లక్ష్యం వహిస్తున్న యూత్… బీ కేర్ ఫుల్!

Read more RELATED
Recommended to you

Latest news