బ్యాంక్ కస్టమర్స్ కి బ్యాడ్ న్యూస్… ఇక నుండి వారానికి 5 రోజులే..!

-

బ్యాంక్ కస్టమర్స్ కి బ్యాడ్ న్యూస్. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక మార్పులు జరగనున్నాయి. ఆ మార్పులతో ఉద్యోగులకి రిలీఫ్ గా ఉంటుంది కానీ కస్టమర్స్ కి మాత్రం ఇబ్బందే. ఇక మరి దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… బ్యాంకులు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేసే అవకాశాలు త్వరలో కనిపిస్తున్నాయి. ఎప్పటి నుండో ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

banks
banks

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ దీని పైన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఒకవేళ కనుక ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఆర్థిక లావాదేవీలపై అధికంగా ఆధార పడే వ్యక్తులు, సంస్థలకు ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు అంటున్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థల్లో ఐదు రోజుల పని దినాల సంప్రదాయం వుంది.

వారానికి రెండు వీకాఫ్స్ కావాలని చాలాకాలంగా ఉద్యోగులు అడుగుతున్నారు. ఇక బ్యాంకు ఉద్యోగులు వారానికి 5 రోజులే పని చేసి ఉద్యోగులు 2 రోజులు వీకాఫ్ తీసుకోవచ్చు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 25 ప్రభుత్వం అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

ఇలా కనుక జరిగితే ఐదు రోజులు పని గంటలను మరో 50 నిమిషాల వరకు పెంచే ఛాన్స్ వుంది. ఇలా పని చేయడానికి ఉద్యోగులు కూడా సిద్ధం గానే వున్నారు. త్వరలోనే ఈ కొత్త మార్పు రానుంది. అప్పుడు ఉద్యోగులు వారానికి 5 రోజులే పని చేసి ఉద్యోగులు 2 రోజులు వీకాఫ్ తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news